telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కోటి కాంతులతో…కొత్త సంవత్సరం

కాలగమనంలో గతేడాది జ్ఞాపకాలెన్నో..
2020 సంవత్సరం మిగిల్చిన చేదు అనుభవాలెన్నో..
కరోనా అను సూక్ష్మజీవి వల్ల కలిగిన కష్టాలెన్నో…
సమస్త జనావళికి కష్టనష్టాలెన్నో…
భవిష్యత్తు తరాలకి చూపిన బాటలెన్నో..
కోటి కాంతులతో కొత్త ఆంగ్ల సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం…
కష్టనష్టాలు లేని 2021 సంవత్సరాన్ని ఆశిద్దాం…

…………………………………………..

కంటిలో కలలె ఆవిరవుతున్నా
వంటిలో సత్తువ తగ్గిపోతున్నా
కాలం మంచులా కరిగిపోతున్నా
వయసు రాను రాను పెరిగిపోతున్నా
గుండెల్లో బాధ తీరకున్నా
గమ్యం కనుచూపు మేరలో కాన రాకున్నా
నేనున్నాను అని మనకు ధైర్యాన్నిస్తుంది
అదే నవ శకం..అదే నవ వసంతం

Related posts