telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేటీఆర్ పెద్దమ్మ గుడికి ఎందుకు రాలేదు: వీహెచ్

V. Hanumantha Rao

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హన్మంత్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు. బుధవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్లోబరీనాతో తన బావమరిదికి సంబంధం లేకుంటే కేటీఆర్ పెద్దమ్మ గుడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆయన మాట్లాడే భాష మార్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిన నన్నే బఫూన్ అంటావా? అని నిప్పులు చెరిగారు. సమయం వచ్చినప్పుడు ఎవరు బఫూనో చెబుతానని అన్నారు. హాజీపూర్ ఘటనపై వీహెచ్ తీవ్రంగా స్పందించారు. హాజీపూర్ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఎన్‌కౌంటర్ చేయాలని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related posts