telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బంగారు తెలంగాణ కావాలా… కంగారు తెలంగాణ కావాలా…

harish rao trs

టీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరువు లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ హైదరాబాద్ ను పునర్నిర్మిస్తాం అంటే.. ఒకరు పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ కూల్చుతా అని ఒకరు.. ధారుల్ సలాం కూల్చుతం అని ఒకరు అంటున్నారు. హైదరాబాద్ కు పెట్టుబడులు తెచుకుందాం.. అభివృద్ధి చేసుకుందాం అని కేసీఆర్ అంటే.. మత ఘర్షణలు సృష్టించాలని భాజపా చూస్తోంది. హైదరాబాద్ లో శాంతి భద్రతలు దెబ్బతీసి.. ఇక్కడి కి వచ్చే పెట్టుబడులు గుజరాత్, ముంబైకి తరలించుకుపోవలని చూస్తున్నాయి. మరో మూడు సంవత్సరాలు తెరాసనే అధికారంలో ఉంటుంది. కానీ ఈరోజు కాళ్లు మొక్కుతున్న భాజపా వాళ్లు.. రేపు కాళ్లు లాగుతారు అని తెలిపారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని కూల్చుతాం అని భాజపా అంటోంది. తెరాస బంగారు తెలంగాణ అంటే.. భాజపా కంగారు తెలంగాణ అంటోంది. బంగారు తెలంగాణ కావాలో? కంగారు తెలంగాణ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. సెక్యూలర్ ప్రభుత్వం కావాలంటే తెరాసకు ఓటు వేయాలి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో 12గంటలు పని చేయాలని అక్కడి భాజపా ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. కానీ తెలంగాణలో 8 గంటలే పని సమయం. ప్రభుత్వ సంస్థలను కాపాడుకునేందుకు కేసీఆర్ మరో ఉద్యమం చేయబోతున్నారు అని పేర్కొన్నారు.

Related posts