telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

భారత్ భ్రమ పడింది.. అందుకే ఇలా..?

కరోనా ఫస్ట్ వేవ్ తగ్గు ముఖం పట్టగానే మహమ్మారి అంతమైపోయిందని భారత్ భ్రమ పడిందని, దాంతో నిబంధనలను గాలికొదిలేసి అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చిందని, దాని ఫలితంగానే ప్రస్తుత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు అమెరికా అధ్యక్షుడి ముఖ్య వైద్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ అన్నారు. ఎప్పుడైనా అత్యంత ప్రమాదకరమైన, అతి ముఖ్యమైన విషయాల్లో ఎప్పుడూ తప్పుడు అంచనాలు వేయకూడదని, అలా వేస్తే దారుణ విలయాలను ఎదుర్కోవలసి వస్తుందని, ప్రస్తుతం భారత్ అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోందని అన్నారు.  అంతేకాకుండా ఇప్పుడు భారత్‌లో నెలకొన్న పరిస్థితులు ప్రపంచానికి కనువిప్పు కావాలని సూచించారు. ప్రపంచ దేశాలు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన సదుపాయాలు ఎల్లవేళలా సన్నద్ధంగా ఉంచుకోవాలని, ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ వెళ్లాలని సూచించారు. ప్రపంచ మహమ్మారులపై పోరాటంలో ఏ ఒక్క దేశం ఒంటరిగా పోరాటం చేయలేదని.. ప్రపంచ దేశాలన్ని ఏకమై బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Related posts