తమ సొంత వాహనాల్లో ప్రజలు జిల్లాలను దాటి వెళ్ళేందుకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులూ అక్కర్లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సీనీయర్ ఐపీఎస్ అధికారులు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్ జిల్లాల ప్రయాణానికి అనుమతినిస్తున్నామని తెలిపారు. కారులో ముగ్గురికి మించరాదని, మాస్క్, ఇతర నిబంధనలు వర్తిస్తాయని సవాంగ్ స్పష్టం చేశారు.
గత మూడు రోజులుగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు జిల్లాలను దాటి ప్రయాణిస్తూ ప్రజలను తరలిస్తున్నాయి. వ్యక్తిగత వాహనాలకు ప్రత్యేక అనుమతుల అవసరంపై ప్రశ్నలు వస్తున్నాయని తెలిపారు. ప్రత్యేక పాస్ లు తీసేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు డీజీపీ తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద మినహా మరెక్కడా వాహనాలకు పాస్ లు అడగవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు. కారును ఎక్కడైనా ఆపి పోలీసులు తనిఖీ చేస్తారని తెలిపారు.