telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

పదిలో ప్రతిభ చూపినవారికి .. 5లక్షల స్కాలర్ షిప్ …

5laks scholarship for ssc toppers

ఉన్నతచదువులు చదవాలని ఉన్నా ఆర్థిక స్తొమత లేక ప్రాథమిక విద్యతో ఆపేస్తున్న వారిని చాలా సంస్థలు ప్రోత్సహకాలు ఇస్తూ ఆడుకుంటున్న విషయం తెలిసిందే. అదేవిధంగా పదో తరగతిలో 9.3 జీపీఏగ్రేడుతో ఉత్తీర్ణులై ఉంటే.. కుటుంబ సంవత్సర ఆదాయం లక్షలోపు ఉంటే జకత్ ఛారిటబుల్ ట్రస్ట్, ఎకనామిక్ అండ్ ఎడ్యూకేషనల్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ 5లక్షల స్కాలర్ షిప్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఈ స్కాలర్ షిప్ పొందాలంటే.. హైసెట్.. అంటే.. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ టెస్ట్.. రాయాల్సి ఉంటుంది. ఇందులో మంచి మార్కులు సాధించినవారికి రెండేళ్లకు రూ.5 లక్షల ఉపకార వేతనాలను రెండు దఫాలుగా ఇస్తారు.

హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్టెన్స్ కళాశాలలో ఇంటర్మీడియెట్ లో ప్రవేశం; భోజనం, వసతి సౌకర్యాలు అందజేస్తారు. పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉపకార వేతనాలు అందజేసేందుకు బేగంపేటలోని జకత్ ఛారిటబుల్ ట్రస్ట్ ఈ ఏర్పాటు చేస్తోంది. ప్రొఫెసర్ అమీరుల్లాఖాన్, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ జావెద్ హుద్ తదితరులు ఈ కార్యక్రమానికి సంబంధిత బ్రోచర్లు ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏడు కేంద్రాల్లో నవంబరు 17వ తేదీ నుంచి డిసెంబరు 8 వరకు హైసెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 98665 56891 లేదా www.hie.net.in లో సంప్రదించవచ్చు.

Related posts