telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

శ్రీవారి లడ్డూతో వ్యాపారం చేయడం తప్పు: రమణ దీక్షితులు

Ramana Deekshitulu TTD

తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయంపై టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను ప్రతి చోట విక్రయిస్తామని చెప్పటం అభ్యంతరాలకు తావు ఇస్తుంది. పవిత్రమైన పసాదాన్ని ఒక స్వీట్ లాగా అమ్మటం ఏంటని?, పలువురు ప్రశ్నిస్తున్నారు. 50 రూపాయలు ఉండే లడ్డూ, 25 రూపాయలకు తగ్గించి విక్రయించడం పై కూడా విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీటీడీ గౌరవ ప్రధాన అర్చుకులు రమణ దీక్షితులు మాట్లాడుతూ తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం, స్వామి వారి దర్శనం తరువాత, ప్రసాదాలు ఇస్తారని తెలిపారు. అంతే కాని, దర్శనాలు చెయ్యకుండా, ఎక్కడ పడితే అక్కడ, కౌంటర్ పెట్టి అమ్మటం తప్పుడు నిర్ణయం అని అన్నారు. ఆగమ శాస్త్రం గురించి ఆలోచించకుండా ఇలా చేయడంతో ప్రభుత్వంపై ఒక మచ్చలాగా ఏర్పడుతుందని రమణ దీక్షితులు అన్నారు. ఇది జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా ఒక చెడ్డ పేరు తెచ్చేలా ఉందని రమణ దీక్షితులు అన్నారు.

ఆగమ శాస్త్ర పండితులు దగ్గర సలహాలు తీసుకోకుండా ఇలా చెయ్యటం కరెక్ట్ కాదు అని అన్నారు. శ్రీవారి లడ్డూతో వ్యాపారం చేయడం చాలా తప్పు అని అన్నారు. ఎక్కడైనా స్వామి వారిని దర్శించుకుని, తరువాత ప్రసాదం ఇవ్వాలని, అలా కాకుండా, ఇలా వ్యాపారం చెయ్యటం, సమంజసం కాదని చెప్పారు. తమను కనుక సలహాలు అడిగి ఉంటే, మేము కచ్చితంగా ఇవి ఒప్పుకునే వారం కాదని అన్నారు. స్టాక్ ఎక్కవు అయిపోయే, తక్కు రేటుకి అమ్మటం, భక్తుల మనోభావాలు దెబ్బ తినటమేనని రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు.

Related posts