telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కమ్మ సామాజిక వర్గంపై ఏపీ సీఎం కక్ష్య: సుంకర ఆరోపణ

sunke venkataramana kamma corporation

కమ్మ సామాజిక వర్గంపై ఏపీ సీఎం జగన్ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని విజయవాడ కమ్మ వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు సుంకర వెంకట రమణ ఆరోపించారు. సీఎం జగన్, వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి, తమ్మినేని సీతారాం, అంబటి రాంబాబు గారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని కమ్మ సామాజిక వర్గం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.

కమ్మ సామాజిక వర్గంవారు అర్హతను బట్టి ఉన్నత పదవులు అనుభవించడం తప్పా? అని సీఎం ను ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల ద్వారా పదోన్నతులు పొందుతున్నామా అని నిలదీశారు. చంద్రబాబు కమ్మ వారు అయితే ఇంకా ఏ అధికారి కూడా చట్టం ప్రకారం నడుచుకో కూడదా అని దుయ్యబట్టారు. మీరు సామాజికవర్గం ఆపాదించడం కారణంగా అధికారుల, కమ్మ సామాజికవర్గ ప్రజల మనోదైర్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు.

రాగద్వేషాలు లేకుండా కుల,మతాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పిన జగన్.. ఒక కులవర్గానికి నాయకుడుగా మాట్లాడారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కనిపించలేదు, కమ్మ అధికారులు ఉన్నత పదవులలో ఉండకూడదా.?మీకు ఇష్టం లేకపోతే కేంద్రానికి అటాచ్ చేయండని విన్నవించారు. కమ్మ సామాజిక వర్గం మీద సరైన అభిప్రాయం లేని వైఎస్సార్సీపీ లో కమ్మ నాయకులకు విలువ ఉంటుందా? అని ప్రశించారు.

కమ్మ సామాజిక వర్గ వైఎస్సార్సీపీ నాయకులు ఆలోచించుకోండి, ఎవరు ఎవరి పల్లకి మోస్తున్నారు అని, సామాజిక వర్గానికి రాజకీయాలు ఆపాదించే ముఖ్యమంత్రి ఉన్నపుడు మనం కూడా మన కులం గుర్తు చేసుకోవడం తప్పు కాదని తెలిపారు. రాష్ట్రంలో అట్రాసిటీ ఎదుర్కుంటున్న పరిస్థితి,కమ్మ కులస్థులకు కూడా అట్రాసిటీ రక్షణ చట్ట పరిరక్షణ కావాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆ వర్గం పేర్కొంది.

Related posts