telugu navyamedia
క్రీడలు వార్తలు

అశ్విన్ పేరిట మరో రికార్డు…

కరోనా అనంతరం భారత్ లో చెన్నై వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా స్పిన్నర్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. అయితే నిన్న భారత్ ఆల్ ఔట్ అయిన తర్వాత 241 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ఫాలోఆన్ ఎంచుకోకుండా బ్యాటింగ్ కు దిగ్గింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే అశ్విన్ షాకిచ్చాడు. ఇన్నింగ్సులో తొలి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ బర్న్స్‌ను అవుట్ చేశాడు. దీంతో 114 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే అంతకుమందు, 114 ఏళ్ల క్రితం.. 1907లో దక్షిణాఫ్రికా బౌలర్ బెర్ట్ వోగ్లర్… అంతకు మందు 1888లో ఇంగ్లండ్ స్పిన్నర్ బాబీ పీల్ పేరిట ఈ రికార్డు ఉండేది. అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే చివరి రోజు 381 పరుగులు చేయాలి. అయితే ప్రస్తుతం టీమిండియా 39/1 తో ఉంది భారత్. మరి ఈరోజు ఆటలో ఏం జరుగుతుంది… ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

Related posts