telugu navyamedia
సినిమా వార్తలు

33 సంవత్సరాల “బ్రహ్మర్షి విశ్వామిత్ర”

నందమూరి తారకరామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన పిదప నటించిన చిత్రం “బ్రహ్మర్షి విశ్వామిత్ర” 19-04-1991 విడుదలయ్యింది.

నందమూరి జయకృష్ణ సమర్పణలో నందమూరి హరికృష్ణ నిర్వహణలో ఎన్.టి.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. గారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కధ,స్క్రీన్ ప్లే,ఎడిటింగ్: ఎన్.టి.రామారావు, రచన, మాటలు: నాగబైరవ కోటేశ్వరరావు, పాటలు: సి.నారాయణరెడ్డి, సంగీతం: రవీంద్రజైన్, ఫోటోగ్రఫీ: నందమూరి మోహనకృష్ణ,కళ: కేతా, నృత్యం: గోపీకృష్ణ,
రఘు,శివసుబ్రహ్మణ్యం, అందించారు.

ఈ చిత్రం లో ఎన్.టి.రామారావు, గుమ్మడి, నందమూరి బాలకృష్ణ, మీనాక్షి శేషాద్రి, దీపిక, కనక, మధుమిత, అరుణాఇరాణి, అంజాద్ ఖాన్, డిస్కోశాంతి, కుయిలీ, కె.కె.శర్మ, సుత్తివేలు, అశోకకుమార్, మిక్కిలినేని తదితరులు నటించారు.

బాలీవుడ్ సంగీత దర్శకుడు రవీంద్రజైన్ గారి సారధ్యంలో వెలువడిన పాటలు
“ఎందరో బులిపించినా మరులెంతగా”
“ప్రియా చెలియా”
“ఈ చిన్నది ముద్దుల చింతామణి”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.

1989జూన్ 18 న హైదరాబాద్, నాచారం లోని రామకృష్ణ స్టూడియోలో నేషనల్ ఫ్రంట్ నాయకులు వి.పి.సింగ్, దేవీలాల్,కరుణానిధి, మహంతా తదితరులు సమక్షంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిమైనది.

ఈచిత్రం షూటింగ్ జరిగే సమయంలో ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు నిర్వహిస్తూ షూటింగ్ లోపాల్గొనటం జరిగింది.

ఎన్టీఆర్ గారు ఈ చిత్రంలో తన విశ్వరూపం ప్రదర్శిస్తూ ఎక్కడా వన్నె, వాసి తగ్గకుండా మన ప్రాచీన సంస్కృతి వైభవోన్నతికి తన అసమాన ప్రఙ్ఞాపాటవాలను జోడించి ఉన్నతంగా ఈ చిత్రాన్ని రూపకల్పన గావించినప్పటికి ఈ సినిమా ఆశించిన మేరకు విజయవంతం కాలేకపోయింది.

ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో చిత్రీకరించారు. ఈ చిత్రం హిందీ వర్షన్ లో భరతుడు పాత్ర లో జూనియర్ ఎన్.టి.ఆర్. (తారక్) తొలిసారి బాలనటుడిగా చలన చిత్రరంగానికి పరిచయం కావటం జరిగింది. అయితే విశ్వామిత్ర హిందీ చిత్రం ఇప్పటికి విడుదల కాలేదు.

ఎన్టీఆర్ గారు నటించిన చిత్రాలలో “బ్రహ్మర్షి విశ్వామిత్ర” హిందీ చిత్రం ఇంకను విడుదల కావలిసిన సినిమాగా మిగిలిపోయింది.

Related posts