telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో కేసులు పెరగడంతో ప్రభుత్వం చేతులెత్తేసింది: చంద్రబాబు

chandrababu

ఏపీలో కేసులు పెరగడంతో ప్రభుత్వం విఫలమవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీని ఒక ఆ దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు.ఓ గ్రామంలో కరోనా అనుమానితుడి కోసం అంబులెన్స్ రాగా, అంబులెన్స్ ఎక్కేందుకు తలుపులు తీయడంతో ఆ వ్యక్తి దిగ్భ్రాంతికి గురికావడంతో చంద్రబాబు స్పందించారు.

“108 అంబులెన్స్ లో కరోనా అనుమానితులను జంతువులను కుక్కినట్టుగా ఎక్కించడం చూడ్డానికి భయానకంగా ఉంది. 108 కోసం చేసిన పబ్లిసిటీ అంతా దీనికోసమేనా! ఇదంతా చూస్తుంటే, ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని భావించాల్సి వస్తుంది. ఆ దేవుడే ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలి” అంటూ ట్వీట్ చేశారు.

Related posts