telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గిరిజనులను చంపేందుకే రాష్ట్రంలో 15 పులులను వదిలారు…

soyam bapu rao

బీజేపీ ఎంపీ సోయం బాపు రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ఆపలంటూ సోయం బాపు రావు పెద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇది మరువకముందే..మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గిరిజనులను వెళ్లగొట్టాలనే ఆలోచనతోనే పులుల్ని తెచ్చి వదిలారని… రాష్ట్రంలో మొత్తం 14-15 పులుల్ని వదిలారని ఫైర్‌ అయ్యారు. పులులను పట్టుకోవడం అటవీ శాఖ అధికారులు కు పెద్ద సమస్య కాదని… కుట్ర పూరితంగా పులులను తెచ్చారు కాబట్టే పట్టుకోలేక పోతున్నారని ఆరోపణలు చేశారు. గిరిజనులను అడవులకు దూరం చేసే ప్రయత్నం లో భాగమే ఇది అని… మనుషుల ప్రాణాల కంటే పులుల ప్రాణాలు ముఖ్యం కాదన్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వాలని… నకల్స్ తో సంబంధాలు ఉన్నాయని ఆదివాసులనే చంపుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పులుల పేరిట ఆదివాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని…చివరికి రోగాలు, నొప్పులతో కూడా ఆదివాసులే చనిపోతున్నారని ఆవేదన వక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు గుర్తించాలని కోరారు.

 

Related posts