telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొరటాల సినిమా టైటిల్ చెప్పేసిన చిరు…!

chiru-koratala

నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌ వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘ఓ.. పిట్ట కథ’. చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశ్వంత్‌, నిత్య, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం (మార్చి 1,2020) హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఇక కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని టైటిట్ పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టైటిల్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. దీనికి మెగాస్టార్ చిరంజీవి తెరదించారు. స్వయంగా ఆయనే టైటిల్ చెప్పేశారు. సినిమా పేరు ”ఆచార్య” అని చిరంజీవి రివీల్ చేశారు. ”ఓ..పిట్ట కథ” సినిమా ప్రి రిలీజ్ వేడుకలో చిరంజీవి ఈ విషయం చెప్పారు. ఆ వెంటనే డైరెక్టర్ కొరటాలకు చిరు సారీ కూడా చెప్పడం విశేషం. సినిమా పేరు బయటపెట్టేసినందుకు చిరంజీవి సారి చెప్పారు.

Related posts