telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పాత జ్ఞాపకాలు.. గుర్తుకు వస్తున్నాయి

ఇంజక్షన్ చెయ్యని డాక్టరు……

 

చిల్లర అడగని కండక్టరు…..

 

నవ్వుతూ ఉండే పోలీసు…..

 

కోపంగా రుసరుసలాడే ప్రేయసి……

 

ఉప్పు అద్దిన మామిడికాయ………

 

దేవుడికి నైవేద్యం పెట్టిన సగం కొబ్బరి ముక్క……..

 

రాత్రి పూట వచ్చే కుల్ఫీ………

 

ఆదివారం స్నేహితులతో కబుర్లు……..

 

చెట్టుకింద కూర్చోని దేనికీ ఉపయోగపడని వాదనలు…..

 

నిద్రపోనివ్వని జీవితభాగస్వామి గురక……….

 

ఎక్కడ జీవితం దారి తప్పుతుందో అనే నాన్న కోపం..

 

ఎంత చిరాకు పెట్టిన పెదాల పై చిరునవ్వు చెరగని అమ్మ ప్రేమ..

 

ఎక్కడ బాగుపడతామో అని ఏడ్చే బంధువులు…

 

ప్రతి క్షణం మన ప్రేమ కోసం ఎదురు చూసే ఒక హృదయ నేస్తం…

 

అందమైన ప్రకృతి…

 

అంతులేని విశ్వం…

 

అంతుచిక్కని రహస్యాలు…

 

ప్రతి క్షణం ఎలా గడపాలో తెలిపే సెల్ ఫోన్…

 

సమస్త జ్ఞానం, సర్వ రోగ నివారిణీ,నిత్య సంబంధాల గొడవకు సోషల్ మీడియా…

 

కొత్త నోటు వాసన……….

 

ప్రయాణంలో కిటికీ పక్కన సీటు……..

 

పసిపిల్లలతో క్రికెట్టు ఆటలు………

 

గుడిలో ఎక్కువ ప్రసాదం…

 

శత్రువు నుండి పొగడ్త………

 

పసికందు ముద్దైన పాదాలు….ముద్దు మాటలు

 

ఇవన్నీ వ్రాస్తున్న నేను……..

చదువుతున్న మీరు……….

 

ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆస్వాదించడానికి…….

లోకంలో మనసుతో ….కళ్ళతో చూసి ఆస్వాదించవలసినవి ఎన్నో…….ఎన్నెన్నో….ఉన్నాయి…

భవిష్యత్తులో

 

రండి……మీ బాధలను…….కష్టాలను అన్నిటినీ మరచిపోయి హాయిగా ఆనందంగా జీవించండి…. ఇంట్లోనే వుండండి

 

రాబోయే అందమైన జీవితాన్ని ఆస్వాదించండి……. కరోనా ని ఎదిరించండి బౌతిగంగా దూరంగా వుంటూ మనసులకు దగ్గరగా ఉందాం. .!!!

 

Related posts