telugu navyamedia
రాజకీయ వార్తలు

అసెంబ్లీకీ హాజరైన నిండు గర్భిణి ఎమ్మెల్యే

beedmla mla

నిండు గర్భిణి అయిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని బీద్‌ నియోజకవర్గం నుంచి నమిత ముందాద( 30) బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నమిత 8 నెలల గర్భవతి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. నిండు గర్భిణి అయినప్పటికీ తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఆమె అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం తన విధి, బాధ్యత అని నమిత పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. వాటిని సభలో లేవనెత్తాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తనకు ఇబ్బంది ఉన్నప్పటికీ సభకు హాజరయ్యానని నమిత చెప్పారు. తనకు కూడా ఇతర గర్భిణిల లాగే సమస్యలు ఉన్నాయి. డాక్టర్ల సలహాలు పాటిస్తూ అసెంబ్లీకి వచ్చానని ఆమె తెలిపారు.

Related posts