telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రేమంటే ఇదేకదా…

ప్రేమంటే ఇదేకదా

ఎంత సేపైనా సరే నిను చూస్తునే వుంటా

ఎంత కాలమైనా నీకై వేచి చూస్తునే వుంటా

ప్రేమంటే ఇదేకదా…!

 

 రోజులు గడిచేకొద్ది ఇష్టకాంక్షలు పెరగి

నీ చిత్రం నా చిత్తంలో చిగురించినాక

ప్రతి క్షణం నీకై ఆరాటమే నాలో

ప్రేమంటే ఇదేకదా..!

 

యుక్తత్వం ముగ్ధత్వం

తొడిగిన తొలకరి మనసు

తోడు కోరుకోవడం

ప్రేమంటే ఇదేకదా…!!

 

ఆకర్షణ కానిది

మాయలు లేనిది

ఆమోదం పొంది

ఆయుష్షు పెంచుకున్నదే

ప్రేమంటే ఇదేకదా…!!

 

ప్రేమ ,ప్రణయానికి

దారితీసే సంఘటనలు

ప్రమోదం లబించితే

ప్రేమంటే ఇదేకదా…!!

 

 ఆటుపోట్లు

 మాటలు మనస్పర్థలు

 ఎన్నివచ్చిన

విచ్చినపు ఆలోచన రానిదే

ప్రేమంటే ఇదేకదా…!!

 

నిత్యం నిరంతరం

ఒకరికోసం ఒకరం

అనే భావనే

 ప్రేమంటే ఇదేకదా…!!.

 

 

Related posts