telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

యడ్యూరప్పపై .. వారెంట్ జారీ.. !!

yadurappa on audio tape

కర్ణాటక రాజకీయాలలో వేడి పెరిగిపోతుంది. రోజురోజుకు బీజేపీకి అధికార పార్టీకి మధ్య రచ్చ రోడ్డెక్కుతుంది. ఇటీవల ఆడియో టేపుల వివాదం సమావేశాలలో వేడి పుట్టించింది. దీనితో ఈ విషయం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్‌.యడ్యూరప్పపై రాయ్‌చూర్‌ జిల్లా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జెడి(ఎస్‌) ఎమ్మెల్యే నాగన్‌గౌడ్‌ కుమారుడు శరణ్‌గౌడకు నగదు, మంత్రి పదవి ఇస్తామని ప్రలోభపెట్టినట్లు ఇటీవల ఆడియోటేప్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శరణ్‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం యడ్యూరప్పపై కేసు నమోదుచేసినట్లు అధికారులు తెలిపారు. అలాగేమరో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు దేవదుర్గకు చెందిన శివనాగౌడ నాయక్‌, హసన్‌కుచెందిన ప్రీతమ్‌ గౌడ్‌లతో పాటు యడ్యూరప్ప సలహాదారుగా ఉన్న మాజీ జర్నలిస్ట్‌, న్యాయవాది మారాంకల్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. యడ్యూరప్ప, శరణ్‌గౌడ్‌తో సమావేశమైన సమయంలో వీరుకూడా అదే నివాసంలో ఉన్నట్లు తెలిపారు.

ఇక ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 10 కోట్లు మరియు మంత్రి పదవీ అంటూ.. బీజేపీ ఇంకా జేడీఎస్ నేతలకు గాలం వేస్తూనే ఉందని పిర్యాదులు ఇస్తూనే ఉన్నాడు కర్ణాటక సీఎం కుమారస్వామి. ఈ కథ ఆయన సీఎం అయినప్పటి నుండి జరుగుతూనే ఉంది. బీజేపీ కూడా అధికారం కోసం అప్పటి నుండి ప్రయత్నిస్తూనే ఉంది. వీరిద్దరూ కలిసి నన్ను మార్చి మార్చి రేప్ చేసినట్టుగా ఉందని మధ్యలో స్పీకర్ నలిగిపోతున్నట్టు కూడా ఇటీవల సమావేశాలలో చూస్తున్నాం, స్పీకర్ స్వయంగా ఈవిధంగా అనడం జరిగింది కూడా.

Related posts