telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ఏపీ ఎన్నికల బరిలో సినీ ప్రముఖులు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో సినీ నటుల పోటీ పెరుగుతుంది. ఎన్నికల్లో తమ సత్తా చాటెందుకు సినీ నిర్మాతలు నటులు ముందుకొస్తున్నారు. ఈ ఎన్నికల్లో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చెయ్యని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పోటీకి దిగుతున్నారు. అలాగే రాజమహేంద్రవరం పార్లమెంట్ నుంచి సినీనటుడు మార్గాని భరత్, విజయవాడ పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ బరిలో ఉన్నారు. అలాగే హిందూపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

వీరితోపాటు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు సినీనటి రోజా, చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీనటి మాధవీలత సైతం పోటీకి దిగుతోంది. సినీనటుడు అలీ కూడా పోటీ చేద్దామని భావించినప్పటికీ టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీ తరపున ప్రచారం చేసే అవకాశం ఉంది.

Related posts