telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రధాని మోదీ హైదరాబాద్​ పర్యటన షెడ్యూల్ ఇదే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొన‌నున్న ఆయ‌న‌.. ఆ త‌ర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు..

*మధ్యాహ్నం 2.10 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ప్ర‌ధాని మోడీ.
* మధ్యాహ్నం 2.15 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో.. పటాన్‌చెరు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ సెలబ్రేషన్స్‌ జరిగే వేదిక వద్దకు చేరుకోనున్న ప్ర‌ధాని.
* మధ్యాహ్నం 2.45 గంట‌ల‌ నుంచి సాయంత్రం 4.15 గంట‌ల‌ వరకు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన‌నున్న ప్ర‌ధాన మోడీ.
* సాయంత్రం 4.25 నిమిషాలకు ఇక్రిశాట్‌ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి సాయంత్రం 4.50 గంట‌ల‌కు హైదరాబాద్‌ హెలిప్యాడ్‌కు ప్రధాని.. అక్కడి నుంచి రోడ్‌ మార్గంలో సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరానికి మోదీ చేరుకోనున్నారు.
* సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు రామానుజ సహస్రాబ్ది వేడుకలలో పాల్గొన‌నున్న‌ ప్రధాని..
*రాత్రి 8.20 గంట‌ల‌కు శంషాబాద్‌ ఎయిర్‌‌ పోర్ట్‌కు చేరుకున్న ప్ర‌ధాని..
* రాత్రి 8.40 గంట‌ల‌కు ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి తిరిగు ప్ర‌యాణం కానున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.

మ‌రోవైపు.. ప్రధాని మోడీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేంద్ర బృందాలు, రాష్ట్ర పోలీసులు సహా దాదాపు 7,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రధాని భద్రత కారణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటున్నారు.

Related posts