మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని అన్నారు. తెరాస పార్టీ మోసపూరిత వాగ్దానాలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం అని వారి ఓట్లు పొందారు. కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అర్హత కలిగిన వారికి ఆసరా పిన్షన్ ఇస్తాం అని ఇంతవరకు కొత్తగా వీటిని మంజూరు చేయలేదు. ఇద్ధిరమ్మ ఇల్లెంటి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తాం అని ఇంతవరకు వాటిని ఇవ్వలేదు. LRS అని పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే తెరాసా ప్రభుత్వానికి ఖమ్మం ప్రజలు గుణపాఠం చెబుతారు అని పేర్కొన్నారు. ఇక మంత్రి అజయ్ కుమార్ ఆర్భాటాలకు పోయి చేయని గొప్పలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన రోడ్లకు లైట్స్ పెట్టీ, ఐ లండ్స్ కు ఫౌంటైన్ పెట్టీ దాని తను చేసినట్టు చెబుతున్నారు. ఖమ్మం అభివృద్ధి అంటే మమతా హాస్పిటల్ రోడ్డు అభివృద్ధి చేసుకోవడం కాదు అని పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ నామీద హత్యాయత్నం చేసే సరికే వేగంగా పోయాను అని అన్నారు. అంటే నగరంలో మంత్రికే భద్రత లేకపోతే మిగిలిన వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించలేక పోతున్నది అనేది అర్థం అవుతుంది అని తెలిపారు. ఖమ్మం నగరంలో 50 డివిజన్లలో నిరుద్యోగ భృతి కోసం 7వ తేదీ దీక్ష చేస్తాం అని చెప్పిన ఆయన ఆ తరువాత ఇండ్ల సమస్యలపై కూడా దీక్ష చేస్తాం అన్నారు. మంత్రి పదవిని ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలి అంతేగానీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకుడదు. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది అని తెలిపారు.
previous post
సుజనా బంధువులకు 124 ఎకరాలు.. భూముల చిట్టావిప్పిన బొత్స