telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైద‌రాబాద్ ప‌బ్స్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. రాత్రి 10 దాటితే నో సౌండ్

*హైద‌రాబాద్ ప‌బ్స్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
*రాత్రి10 దాటితే పబ్స్ లో ఎటువంటి సౌండ్ ఉండకూడదు
*ప‌బ్‌ల‌లో రాత్రి పూట కేవలం లిక్క‌ర్ మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేయాలి..

హైదరాబాద్ లో గబ్బు రేపుతున్న పబ్ కల్చర్ పై మరోసారి హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్స్ నిర్వహణపై హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

నేటి (సోమవారం) నుంచి రాత్రి 10 దాటితే పబ్స్ లో ఎటువంటి సౌండ్ ఉండకూడదని హై కోర్టు పేర్కొంది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉంద‌ని, రాత్రి వేళ‌ల్లో ఎటువంటి సౌండ్ సిస్టంకు అనుమ‌తి లేద‌ని హైకోర్టు పేర్కొంది.

ఎక్సైజ్ రూల్స్ ప్ర‌కారం ఇళ్లు, విద్యాసంస్థ‌ల ఉన్న ప్ర‌దేశాల్లో ప‌బ్‌ల‌కు ఎలా అనుమ‌తి ఇచ్చార‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది. ప‌బ్‌ల‌కు ఏ అంశాల‌ను ప‌రిగ‌ణించి అనుమ‌తులు ఇచ్చారో ఎక్సైజ్ శాఖ కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.

రోజు రోజుకీ హైదరాబాద్ లో పబ్ కల్చర్ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. పలువురు పబ్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా పబ్బులు నడుపుతూ.. యువతను పక్కదారి పట్టిస్తున్నారంటూ గత కొంతకాలంగా ఆందోళల వ్యక్తం చేస్తున్నారు.

Related posts