telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

బాబును విక్రయించిన కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం…

శిశువును విక్రయించిన ఈ కేసులో నాచారం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. డబ్బుల కోసమే శిశువును విక్రయించినట్టుగా తేల్చారు పోలీసులు.. బాబు పుట్టకముందే.. విక్రయించాలని నిర్ణయానికి వచ్చి లక్ష రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు.. దాంట్లో భాగంగా శిశువు తల్లిదండ్రులైన మీనా, వెంకటేష్‌కు అడ్వాన్స్‌గా 50 వేలు ముట్టచెప్పారు. అయితే, గతంలో మీనా, వెంకటేష్‌ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలే పుట్టారు.. ఈ సారి కూడా ఆడ పిల్ల పుడుతుందని భావించిన ఆ దంపతులు.. డీల్‌కు ఒప్పుకున్నారు.. కానీ, బాబు పుట్టడంతో ముందుగా కుదిరిన డీల్ కంటే మరో నాలుగు లక్షలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డీల్‌కు జానకి అలియాస్ ఝాన్సీ మధ్యవర్తిత్వం వహించగా.. రాజేష్, నవీన దంపతులు కొన్నారు.. అయితే, అదనంగా రూ.4 లక్షలు ఇవ్వడానికి మాత్రం రాజేష్ దంపతులు అంగీకరించలేదు. దీంతో 4 నెలల తర్వాత పోలీసులకు బాబు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో… ఈ మొత్తం వ్యవహారం వెలుగుచూసింది. ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. బాబు తల్లిదండ్రులు మీనా, వెంకటేష్‌తో పాటు.. మధ్యవర్తి జానకి, బాబును కొన్న రాజేష్‌ను కూడా అరెస్ట్ చేశారు నాచారం పోలీసులు. వారిని మరికొద్ది సేపట్లో రీమాండ్ కు తరలించనున్నారు పోలీసులు.

Related posts