telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఆ రాష్ట్రంలో .. కొత్త చట్టం .. 24 గంటలు దుకాణాలు ..

new act on 24x7 business in tamilanadu

తమిళనాడు లో ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది.. తాజాగా, రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, సంస్థలు 24 గంటలు పనిచేసేలా త్వరలో చట్టం అమలుకు శ్రీకారం చుడుతోంది. దుకాణాలు, సంస్థలు పనిచేసే విధానాలను రాష్ట్రప్రభుత్వం అమలుపరుస్తుంది. ఈ నేపథ్యంలో, 2016లో కేంద్రప్రభుత్వం దుకాణాలు మరియు సంస్థలు (విధుల నియంత్రణా మండలి, సేవలకు సంబందించిన నిబంధనలు) చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ ప్రకారం సినిమా థియేటర్లు, హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు సహా పలు పరిశ్రమలు వారం లో 7 రోజుల పాటు 24 గంటలు పనిచేయవచ్చు. ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు అలాగే అమలుచేయకుండా, ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్చుకొని అమలు చేస్తున్నాయి.

ఈ చట్టాన్ని మొట్టమొదటిసారిగా అమలుచేసిన రాష్ట్రంగా మహారాష్ట్ర పేరు గాంచింది. 2018 నుంచి ఆ రాష్ట్రంలో దుకాణాలు, పరిశ్రమలు 24 గంటలు పనిచేసేలా నిబంధనల్లో మార్పు చేశారు. అలాగే, రాష్ట్రంలో 2017 మార్చి 22వ తేది దుకాణాలు, పరిశ్రమలు 24 గంటలు పనిచేసేలా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వానికి కార్మికశాఖ కమిషనర్‌ రాసిన లేఖలో… మహిళల భద్రత సహా పలు నిబంధనలతో దుకాణాలు, పరిశ్ర మలు 24 గంటలు పనిచేసేలా అనుమ తులు ఇవ్వవచ్చని కమిషన్‌ లేఖలో ప్రభుత్వానికి సిఫారసు చేశారు.

ఈ సిఫారసులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వ దీనిపై త్వరలో అధికారపూర్వక ప్రకటన విడుదల చేయనుంది. అందులో ముఖ్యంగా, వారంలో ఒకరోజు కార్మికులకు షిఫ్టు పద్ధతిలో సెలవు ఇవ్వాలి. ఏయే రోజు ఏ కార్మికుడు సెలవు అనే వివరాలతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలి. ఏ కార్మికుడైనా 8 గంటలకు అధికంగా అంటే వారంలో 48 గంటలు, ఓవర్‌ టైంను ఒక రోజుకు 10.30 గంటలు అంటే వారంలో 57 గంటలకు మించి విధులు నిర్వహింపజేయరాదు. సాధారణ రోజుల్లో రాత్రి 8 గంటలకు పైన మహిళలు పనిచేయాల్సిన అవసరం లేదు. రాతపూర్వకంగా వారు అంగీకారం తెలియజేస్తే రాత్రి 8 నుండి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు తగిన భద్రత కల్పించి విధులను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

Related posts