telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

జహీరాబాద్‌లో సెల్ఫ్ లాక్ డౌన్

lockdown corona

సంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరించడంతో అక్కడ రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా వైరస్ నుండి రక్షించుకోవడానికి జహీరాబాద్‌లో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. ఇందులో భాగంగా తమ తమ దుకాణాలను వ్యాపారస్తులు మూసివేసి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలో గురువారం వరకు నిర్వహించిన పరీక్షల్లో 18.85 శాతం మేరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,018కు చేరింది. వీరిలో 27,295 మంది వైరస్‌ నుంచి కోలుకోగా… 13,328 మంది చికిత్స పొందుతున్నారు. దాదాపు 396 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు.

Related posts