telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

త్వరలో ఏపీ రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం…

Ycp Kannababu

ఎన్జీరంగా విశ్వవిద్యాలయం రూపోందించిన సాగు, మార్కెటింగ్ వివరాలకు సంబంధించిన వ్యవసయా పంచాంగాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కన్నబాబు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలకు వ్యవసాయ వివరాలతో కూడిన పంచాంగాన్ని మంత్రి కన్నబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా కన్నబాబు మాట్లాడుతూ..ఈ నెల 31 తేదీలోగా పంట నష్టం సర్వే పూర్తి అవుతుందని పేర్కొన్నారు. పంట నష్టం అంచనాలపై త్వరలోనే రాష్ట్రానికి  కేంద్ర బృందం రానున్నదని తెలిపారు. రైతులే స్వయంగా విత్తనాలు  తయారు చేసుకునేలా రాష్ట్రంలో విత్తన గ్రామం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. సీజన్ వారీగా పంటలు, భూసార పరీక్షలు, మార్కెటింగ్ వివరాలు, నూతన వంగడాల వంటి అంశాలను వ్యవసాయ పంచాంగంలో పొందుపర్చారని చెప్పారు. రైతులకు ఆధునిక సాగు మెళకువలు, శిక్షణ కోసం విజయవాడలో డిజిటల్ స్టూడియో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి. 

Related posts