telugu navyamedia
సినిమా వార్తలు

61 సంవత్సరాల “లవకుశ” (తమిళ్ )

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన తమిళ చిత్రం “లవకుశ” (తమిళ్ )19-04-1963 విడుదలయ్యింది.

నిర్మాత ఏ. శంకర రెడ్డి గారు లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై సి.పుల్లయ్య, సి.యస్.రావు గార్ల దర్శకత్వంలో ఈ తమిళ “లవకుశ” చిత్రాన్ని కూడా నిర్మించారు.

ఎన్.టి.రామారావు గారు అప్పటికే “సంపూర్ణ రామాయణం” తమిళ చిత్రం లో శ్రీ రాముడుగా తమిళ ప్రేక్షకులచే నీరాజనాలు అందుకున్నారు. తమిళంలో మరొక పర్యాయం “లవకుశ” తమిళ చిత్రం ద్వారా కూడా శ్రీ రాముడు గా ప్రేక్షకుల మన్నలను పొందారు.

తమిళ చిత్ర పరిశ్రమలో అప్పటికే ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేషన్, జెమిని గణేషన్ లు అగ్ర హీరోలు గా వెలుగొందుచున్నప్పటికి శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు వంటి పాత్రలకు ఎన్టీఆర్ గారినే నిర్మాతలు, దర్శకులు ఎంపిక చేసుకునేవారు. అందువల్ల ఎన్టీఆర్ గారు తెలుగు వారికే కాకుండా తమిళ ప్రజలకు కూడా ఆరాధ్య దైవం అయ్యారు.

ఈ చిత్రానికి కథ: వెంపటి సదాశివబ్రహ్మం,
మాటలు: ఏ.కె.వేలన్,
పాటలు: ఏ.మారుతకాశి, వెంపటి సదాశివబ్రహ్మం,
సంగీతం: కె.వి.మహదేవన్,
ఫోటోగ్రఫీ: పి.ఎల్.రాయ్,
స్పెషల్ ఎఫెక్ట్స్: రవికాంత్ నగాయిచ్,
నృత్యం: వెంపటి సత్యం, కళ: టి.వి.ఎస్.శర్మ,
ఎడిటింగ్: అక్కినేని సమకూర్చారు

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు శ్రీరాముడు గాను, అంజలి సీతాదేవి గాను, లవకుశలుగా మాష్టర్ ఉమా,మాష్టర్ మురళి, లక్ష్మణుడు గా జెమిని గణేషన్, వాల్మీకి గా నాగయ్య, ఆంజనేయుడు గా శాండో కృష్ణన్ వశిష్ఠుడు గా ధూళిపాళ, వాల్మీకి శిష్యుడు గా రమణారెడ్డి నటించారు.

మిగిలిన పాత్రలలో తమిళ నటీనటులు నటించారు. “లవకుశ” తెలుగు సినిమా 29 మార్చి 1963 న విడుదల కాగా తమిళ చిత్రం 19 ఏప్రిల్ 1963 న విడుదల కావటం జరిగింది.

ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. “లవకుశ” తమిళ్ సినిమా 40 వారాలు ఆడింది. తమిళ్ చిత్రంలో నందమూరి తారక రామారావుకు కె.వి.శ్రీనివాసన్ డబ్బింగ్ చెప్పారు.

Related posts