హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..ఈ ఆస్పత్రిని నందమూరి తారకరామారావు ప్రారంభించారని..తెలుగు అంటే అందరికీ ఎన్టీఆర్ పేరు గుర్తుకువస్తుందని బాలయ్య అన్నారు. తల్లి బసవతారకం కోరిక మేరకు పేదలకు క్యాన్సర్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా ఆస్పత్రి ప్రారంభించామని బాలకృష్ణ తెలిపారు. ఎంతోమంది దాతలు హాస్పిటల్ కు సాయం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆర్థికంగా ఆదుకున్న వారికి వందనాలు అని ఆయన వ్యాఖ్యానించారు.
అనంతరం హరీష్ రావు పై బాలయ్య ప్రశంసలు కురిపించుకున్నారు… హరీష్‌రావు ప్రజల మనిషి అని, ఆదర్శమై నాయుకుడు అని కొనియాడారు. ఆయన్ని ఒక్కసారి వెళ్లి కలిస్తేనే.. ఆరు కోట్ల రూపాయిలను ట్యాక్స్‌ను మాఫీ చేశారని అభినందించారు.తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ కింద పేషెంట్ లను ట్రీట్ చేస్తున్న హాస్పిటల్స్ లలో సెకండ్ ప్లేస్ ఉన్నామని బాలకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు, కేసీఆర్‌కు మంచి సంబంధం ఉందని..ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని.. హెల్త్ మినిస్టర్ అయ్యాక బాలకృష్ణ తన దగ్గరకు రెండుసార్లు వచ్చారని హరీష్‌రావు అన్నారు.
బాలకృష్ణ పైకి కరుకుగా కనిపిస్తారని.. మనసు మాత్రం సాఫ్ట్ అని ప్రశంసించారు. బయట బాలకృష్ణ వేరు.. లోపల బాలకృష్ణ వేరు అని హరీష్‌రావు తెలిపారు.
ఎవరు అయిన ఒక రంగంలో రాణిస్తేనే గొప్పగా చెపుతాం, కానీ సేవారంగం, సినిమా రంగం, రాజకీయ రంగం ఇలా అన్నిటిలో రాణిస్తూ, తండ్రి ఎన్టీఆర్ ఆశయాలును ముందుకు తీసుకువెళ్తున్న నిత్య కృషివలుడు నందమూరి బాలకృష్ణ అని హరీష్ రావు ప్రశంసించారు.