telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రోజుకో గుడ్డు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు…!

Egg

ప్రతిరోజూ ఒక గుడ్డును తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి హార్డ్ బాయిల్డ్ ఎగ్ లోనూ పదమూడు ఎస్సెన్షియల్ విటమిన్స్ మరియూ మినరల్స్, విటమిన్స్ ఏ, ఈ, డీ, కే, బీ విటమిన్స్, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, జింక్ తో పాటూ యాంటీ-ఆక్సిడెంట్స్, ఇంకా ఆరు గ్రాముల హై క్వాలిటీ ప్రొటీన్ ఉంటాయి. పైగా అవి అన్ని వేళలా అందుబాటులోనే ఉంటాయి. ప్రోటీన్ వల్లే మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. బాయిల్డ్ ఎగ్స్ లో కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది. మజిల్ బిల్డింగ్ కి కావాల్సిన తొమ్మిది ఎసెన్షియల్ ఎమైనో ఆసిడ్స్ హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ లో ఉండే ప్రోటీన్ లో ఉంటాయి. బాయిల్డ్ ఎగ్స్ లో ఉండే ప్రోటీన్ వల్ల వచ్చే ఎనర్జీ అతి ఆకలి వేయకుండా కాపాడుతుంది. దీని వల్ల ఎంత అవసరమో అంతే తింటాం. ఆటోమాటిక్‌‌గా వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది. ఉడకబెట్టిన గుడ్డులో డెబ్భై క్యాలరీలు ఉంటాయి. కానీ శాచ్యురేటెడ్ ఫ్యాట్ మాత్రం చాలా తక్కువ. బ్రేక్ ఫాస్ట్ లో రెండు ఎగ్స్ తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. రోజంతటికీ కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది. ఎగ్ యోక్ లో కొలెస్ట్రాల్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి… గుండెకి మంచిది కాదు అంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఎగ్స్ నిజానికి గుండెకి చాలా మేలు చేస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ తగ్గించి కార్డియో వాస్క్యులర్ ఫంక్షన్స్ ని బూస్ట్ చేస్తాయి. ఎగ్స్ లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఈ మేలుకి కారణం. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ బ్లడ్ లో ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ నీ, తద్వారా కొలెస్ట్రాల్ నీ తగ్గిస్తాయి. ఇవి మెటబాలిజం ని కూడా రెగ్యులేట్ చేస్తాయి. ఐ హెల్త్ కీ, బెటర్ విజన్ కీ కావాల్సిన రెండు ఇంపార్టెంట్ న్యూట్రియెంట్స్ – విటమిన్ ఏ, ల్యుటేన్ – హార్డ్ బాయిల్డ్ ఎగ్స్‌లో ఉన్నాయి. విటమిన్ ఏ కార్నియా చుట్టూ ఉండే మెంబ్రేన్ ని కాపాడి, రేచీకటి వచ్చే ముప్పుని తగ్గిస్తుంది. ల్యుటేన్ ఒక యాంటీ-ఆక్సిడెంట్. ఇది రెటీనాని స్ట్రాంగ్‌గా చేసి మాక్యులర్ డీజెనరేషన్ జరిగే రిస్క్ ని తగ్గిస్తుంది. ఎగ్స్‌లో ఉండే ల్యుటేన్‌ని బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది కూడా. పళ్ళకీ, ఎముకలకీ విటమిన్ డీ చాలా మేలు చేస్తుంది. ఎగ్ యోక్ లోనే కోలీన్ అనే న్యూట్రియెంట్ ఉంటుంది. ఇది బ్రెయిన్ ఫంక్షన్ ని సపోర్ట్ చేసి సెల్ మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ ని మెయింటెయిన్ చేస్తుంది. బ్రెయిన్ సెల్స్ ఒక దానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా కోలీన్ అవసరం. కోలీన్ వల్ల బ్రెయిన్ లో ఇన్‌ఫ్లమేషన్ వచ్చే రిస్క్ తగ్గడమే కాక, అల్జైమర్స్ వ్యాధి వచ్చే ముప్పు కూడా తగ్గుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే గర్భస్థ శిసువు బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఉపయోగపడడమే కాక బిడ్డకి పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా ఉంటాయి. హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ స్కిన్, హెయిర్, నెయిల్స్ కి కూడా మేలు చేస్తాయి. వీటిలో ఉండే కోలీన్, ల్యుటేన్ ముడతలు రాకుండా చేస్తాయి. బీ విటమిన్స్ కొలాజెన్, ఎలాస్టిన్ ని ప్రొడ్యూస్ చేయడంలో సహకరిస్తాయి. వీటివల్లే చర్మానికి సాగే గుణం ఉంటుంది. హెయిర్, నెయిల్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే బాడీలో కెరటిన్ సరిగ్గా ఉండాలి. ఎగ్స్ లో ఉండే విటమిన్ డీ, బయోటిన్ ఈ కెరటిన్ ని డెవలప్ చేస్తాయి. హెల్దీ బాడీ కి కావలసిన విటమిన్స్, మినరల్స్, హెల్దీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎగ్స్ లో పుష్కలం గా ఉంటాయి.

Related posts