telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తిని రేకెత్తిస్తున్న “కనబడుటలేదు” ఫస్ట్ లుక్

Kanabadutaledu

‘క‌న‌బ‌డుట‌లేదు’ అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో డిఫరెంట్ మూవీ రాబోతోంది. స‌స్పెన్స్ అండ్ ల‌వ్ థ్రిల్ల‌ర్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి బాల‌రాజు దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌.ఎస్‌. ఫిలిమ్స్‌, శ్రీ‌పాద క్రియేష‌న్స్‌, షేడ్ స్టూడియోస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స‌ర‌యు త‌ల‌శిల స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌ధు పొన్నాస్‌ సంగీతం అందిస్తుండగా, స‌ందీప్ బ‌ద్దుల‌ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ర‌వితేజ కుర్మాన ఎడిట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో యుగ్ రామ్, శశిత కోన‌, నీలిమ పెత‌కంశెట్టి, సౌమ్య శెట్టి, ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’ ఫేమ్ రాజు, ఉమామ‌హేశ్వ‌ర రావు, కిశోర్‌, శ్యామ్‌, మ‌ధు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ ‘క‌న‌బ‌డుట‌లేదు’ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య’ చిత్ర‌ ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా, హీరో స‌త్య‌దేవ్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో హీరో సుక్రాంత్ వీరెళ్ల ఒక తాడుకు వేలాడ‌గ‌ట్టిన కొన్ని ఫొటోల వంక సీరియ‌స్‌గా చూస్తుండ‌టం ఉత్కంఠ‌ రేకెత్తిస్తోంది. టైటిల్‌పై ఓ ఫింగర్ ప్రింట్ వేసి జనాల్లో ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. అతిత్వరలో ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేసి మరోసారి థ్రిల్ చేస్తామని అంటోంది చిత్రయూనిట్.

Related posts