telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రానా విరాట పర్వం ఫస్ట్ లుక్…

1990నాటి నక్షలిజం నేపథ్యంలో రానా హీరోగా విరాట పర్వం సినిమా తెరకెక్కతోంది. ఇందులో రానా నక్సల్స్ నాయకుడిగా కనిపించనున్నాడు. అయితే నేడు రానా దగ్గుపాటి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ అతడి అభిమానులకు కనుల విందు చేయాలని అనుకుంది. అంతే రానా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా ఈ రోజు రానా పోస్టర్‌తో పాటు అతడి పేరును కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో నక్సల్ నాయకుడు రవి అన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రానా తన సహచరులతో పాటు అడవిలో తెల్లటి మంచుతెరల్లో నల్లని తుపాకులు పట్టుకొని కనిపించారు. ఆ పోస్టర్‌లో రానా ఆలివ్ గ్రీన్ యూనిఫార్మ్‌లో ఉద్యమానికి నిలువెత్తు రూపంలా కనిపించాడు. అయితే ఈ సినిమా పోస్టర్‌లో అన్ని సినిమాలలా కాకుండా సాయిపల్లవి పేరును మొదట రాసారు. పోస్టర్‌లో సాయి పల్లవి పేరు ముందుండాలని రానా ప్రత్యేకంగా చేయించాడని సాయి చెప్పింది. అంతేకాకుండా టైటిల్ కార్డులలో కూడా ఇదే తరహాలో ఉంటాయిని సమాచారం. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో నవితా పేతురాజ్ చేరింది. తన నటనతో అందరిని ఆకట్టుకుంటుందని తెలుపుతున్నారు.

Related posts