తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దేవస్థానంలో వీఐపీలకు మాత్రమే లభించే ప్రొటోకాల్ దర్శనాన్ని సామాన్యులకు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవాణి ట్రస్ట్ ను ప్రారంభించి, రూ.10 వేలకు ఓ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ఇస్తామని ప్రకటించిన తరువాత, తొలి టికెట్లు విక్రయించారు. చెన్నైకి చెందిన రామయ్య అనే భక్తుడు శ్రీవాణి ట్రస్ట్ కు రూ. 40 వేలు విరాళంగా ఇచ్చి, ఆపై ఒక్కో టికెట్ కు రూ. 500 చెల్లించి నాలుగు టికెట్లను పొందారు.
టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి, రామయ్య కుటుంబానికి ఈ టికెట్లను స్వయంగా అందించారు. శ్రీవాణి ట్రస్ట్ కు రూ. 10 వేలు అంతకుమించి ఇచ్చే దాతలకు ప్రత్యేక ప్రివిలేజ్ కింద బ్రేక్ దర్శన టికెట్ ఇవ్వాలని గతంలోనే నిర్ణయించిన టీటీడీ, సోమవారం నాడు ఈ పథకాన్ని ప్రారంభించింది. భక్తుల కోసం గోకులం విశ్రాంతి భవనంలో సింగిల్ విండో కౌంటర్ ను కూడా ఏర్పాటు చేశారు.
మంత్రులంతా భజనపరులు..భట్టి తీవ్ర విమర్శలు!