telugu navyamedia
క్రైమ్ వార్తలు

యువతి ఆత్మహత్య : నలుగురు యువకులు గ్యాంగ్ రేప్

*మహబూబాబాద్ లో సాముహిక అత్యాచారం..
*23ఏళ్ళ యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్
*ఐదు రోజులుగా చికిత్స పొందుతూ యువ‌తి మృతి..

ప్ర‌భుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, అమ్మాయిలపై అఘాయిత్యాల ఆగ‌డం లేదు. కామాంధుల్లో మాత్రం మార్పు రావట్లేదు. మనిషి రూపంలో సమాజంలో తిరుగుతూ.. ఒంటరిగా కనిపించిన ఆడవాళ్లపై కన్నేసి.. వారి జీవితాలనే చిద్రం చేస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరులో దారుణం చోటుచేసుకుంది. 23ఏళ్ళ యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

వివ‌ర్లాలోకి వెళితే..

నలుగురు వ్యక్తులు తనపై… అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ… ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్​లో నలుగురి పేర్లు రాసి… ఈనెల 18న పురుగుల మందు తాగింది. ఐదు రోజులుగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ… మంగళవారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు న‌మోదు చేసుకు ని ద‌ర్యాప్తు చేస్తున్నారు…

గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ నలుగురు వ్యక్తుల్లో ఎంపీటీసీ భర్త, ఓ పోలీస్ కానిస్టేబుల్, ఓ ఆటో డ్రైవర్, ఓ పూల వ్యాపారి ఉన్నారని పోలీసులు తెలిపారు.

Related posts