పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.‘భీమ్లా నాయక్’ ప్రదర్శించే థియేటర్స్‌లో రెండు వారాల పాటు ఐదో షోకు ప్రత్యేక అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్ కావడంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భీమ్లానాయక్ కు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శిస్తారు. ఇంకా ఏపీలో పెరగిన టికెట్స్ రేట్స్ అమల్లోకి రాలేదు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న ఈ మూవీ విడుదల కానుంది. మరికాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరుపుకోనుంది. ఇప్పటికే వందలాది మంది అభిమానులు ఈవెంట్ దగ్గరకు చేరుకున్నారు. పవన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.