telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

పోలీసుల ముందే యువతి ఆత్మహత్యాయత్నం!

New couples attack SR Nagar

తాను ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి పోలీసుల ముందే ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈ ఘటన హైదరాబాద్, జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, రాజమండ్రికి చెందిన వీరబాబు (20) ఆటో డ్రైవర్ గా పని చేస్తుండగా, లింగంపల్లిలో బ్యూటీషియన్ గా పని చేస్తున్న స్వప్న (20) అతనికి టిక్ టాక్ లో పరిచయం అయింది.వారి స్నేహం ప్రేమగా మారగా, పలుమార్లు స్వప్నను వీరబాబు తన గదికి పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు సన్నిహితంగా వ్యవహరించాడు.

రెండు వారాల క్రితం తనను వివాహం చేసుకోవాలని స్వప్న నిలదీయగా, వీరబాబు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేసింది. ఇద్దరినీ పిలిపించిన పోలీసులు, కౌన్సెలింగ్ నిర్వహించినా, వీరబాబులో మార్పు కనిపించలేదు. తాను స్వప్నను పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేనని వీరబాబు గట్టిగా చెప్పడంతో, స్టేషన్ లోనే బ్లేడుతో గొంతు కోసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు, స్వప్నను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ కేసులో వీరబాబును పోలీసులు అరెస్ట్ చేకేసు దర్యాఫ్తు చేస్తున్నారు.

Related posts