telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ తీర్మానం.. ఆమోదించిన చైనా.. 

jaishe mahammad masud ajahar declared as international terrorist
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ను జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాది ఆదిల్ ఢీకొట్టడంతో 42 మంది జవాన్లు మృతిచెందారు. ఈ ఘటనను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. అయితే డ్రాగన్ మాత్రం స్పందించలేదు. ఉగ్రదాడుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమతి భద్రత విభాగం (యూఎన్ఎస్సీ) సమావేశమై చర్చించింది. ఈ భేటీలో ఫ్రాన్స్ పుల్వామా ఘటనను ప్రస్తావించింది. ఉగ్రదాడి జరిగిన భారత్ కు బాసటగా నిలువాల్సిన సమయం ఇది అని పేర్కొంది. అంతర్జాతీయ నియమాల ప్రకారం దాడులు హేయనీయమని, ఇలాంటి ఉల్లంఘనలను తీవ్రంగా ప్రతిఘటించాలని తెలిపింది.
ఈ సందర్భంగా జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ తీర్మానం చేసింది. జైషే సంస్థను నిషేధిస్తున్నట్టు అందులో పేర్కొన్నది. దీనికి యూఎన్ఎస్సీ సభ్యుదేశాలన ఫ్రాన్స్ తోపాటు అమెరికా, ఇంగ్లాండ్, రష్యా ఆమోదం తెలిపింది. ఈ పరిస్థితుల్లో చైనా విధిగా మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది.
డ్రాగన్ చైనా వైఖరి ఎట్టకేలకు మారింది. పుల్వామా దాడికి తెగబడ్డ జైషే మహ్మద్ దుశ్చర్యను ఖండించింది. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన దుశ్చర్య పిరికిపంద చర్యగా అభివర్ణించింది. ఉగ్ర దాడిలో వీర మరణం పొందిన కుటుంబసభ్యులకు యూఎన్ఎస్సీ సంతాపం తెలియజేసింది. గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ ఘటనతో భారత్ వెంట తాము ఉంటామని స్పష్టంచేసింది. 

Related posts