telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

రెండేళ్ల కుమార్తెపై అత్యాచారం… దంపతులు చచ్చేదాకా జైల్లోనే…!

Parents

అమెరికాకు చెందిన ఓ జంటను ఓక్లహామా కోర్టు కఠినంగా శిక్షించింది. గెరాడ్ కోడింగ్టన్ (25), క్రిస్టీనా నెల్సన్ కోడింగ్టన్ (29) దంపతులు చచ్చేదాకా జైల్లోనే గడపాలని ఆదేశించింది. కనీసం పెరోల్ కోసం విన్నవించుకునే అవకాశం కూడా వారికి ఇవ్వకూడదని నిర్ణయించింది. వీరిద్దరికీ ఇంత కఠిన శిక్ష పడటానికి కారణమేంటో తెలుసా? అమెరికాకు చెందిన వీరిద్దరూ తమ రెండేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఊహతెలియని ఆ పాపను అత్యంత దారుణంగా బలాత్కరించి, దాన్ని వీడియోలు, ఫొటోలు తీశారు. ఇవి తన మెసెంజర్ యాప్‌కు రావడంతో ఖంగుతిన్న ఓ వ్యక్తి.. ఐపీ అడ్రస్ ద్వారా గెరాడ్ పేరిట ఉన్న కంప్యూటర్ నుంచి తనకు ఇలాంటి వీడియోలు వచ్చాయని తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో క్రిస్టీనా దంపతుల బండారం బయటపడింది. పోలీసులకు వీరి కంప్యూటర్‌లో 6వేల పేజీల అశ్లీల కంటెంట్ లభించింది. ఈ మొత్తాన్ని వారు కోర్టు ముందుంచారు. అంతేగాక ప్రస్తుతం గర్భవతిగా ఉన్న క్రిస్టీనా.. తనకు పుట్టబోయే బిడ్డను కూడా లైంగికంగా వేధించాలని అనుకుంటున్నట్లు కొన్ని వీడియోల్లో చెప్పిందని సమాచారం.

Related posts