telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గర్భవతి కూర్చోడానికి సీటు దొరకలేదు… ఆమె భర్త చేసిన పనికి నెటిజన్లు ఫిదా

Is pregnant makeup healthya

చైనాలో ఓ భర్త తన భార్య కోసం చేసిన త్యాగానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చైనీస్ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఓ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. గర్భవతిగా ఉన్న తన భార్యను తీసుకుని భర్త ఆసుపత్రికి వెళ్లాడు. ఈ ఆసుపత్రి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. భార్యాభర్తలిద్దరూ ఆసుపత్రికి వెళ్లగా.. గర్భంతో ఉన్న భార్య కూర్చోడానికి సీటు దొరకలేదు. అయ్యో పాపం గర్భవతి అంటూ.. కనీసం అక్కడున్న వారు కూడా ఆమెపై జాలి చూపించలేదు. దీంతో భర్తే తన భార్యకు సీటులా మారాడు. భర్త నేల మీదే కూర్చోగా.. గర్భంతో ఉన్న భార్య అతడిపై కూర్చుంది. ఈ దృశ్యం చూసిన తరువాత కూడా అక్కడ కూర్చున్న వారిలో ఎటువంటి చలనం రాకపోవడం గమనార్హం. అక్కడున్న వారంతా ఈ జంటను వీడియో తీయడానికి ఇష్టపడ్డారు కానీ.. వారు కూర్చోడానికి ఇంత స్థలం ఇవ్వడానికి ముందుకురాలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భార్యపై భర్త చూపించిన ప్రేమకు ఫిదా అవుతున్నారు. అదేవిధంగా గర్భంతో ఉన్న మహిళకు కనీసం కూర్చోడానికి సీటు కూడా ఇవ్వలేని సమాజంలో బతుకుతున్నామంటూ ఫైర్ అవుతున్నారు.

Video Source: South China Morning Post

Related posts