telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దేశ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువ

ఈరోజు ఐటీ హబ్‌-2 నిర్మాణానికి ఖమ్మంలో శంకుస్థాపన చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామా తో పాటు పలుగురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… తెలంగాణలో  ఐటి రంగం మంచి పురోగతిలో వుందని.. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ఉద్యోగాలు వస్తాయా ? అన్న అనుమానాలు పటాపంచెలు చేశామని పేర్కొన్నారు. దీనికి కారణం… స్థిరమైన ప్రభుత్వం,  కేసీఆర్ నాయకత్వమేనని కొనయాడారు మంత్రి కేటీఆర్‌.  దేశ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా వుందని స్పష్టం చేశారు.   2014లో 56,000 కోట్ల ఐటి ఎగుమతి  ఉంటే… నేడు లక్ష 40 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు.  గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలు పెద్ద నగరాలను వదిలి పెట్టి… హైదరాబాద్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో చురుకైన యువత ఉందని తెలిపారు. అయితే చూడాలి మరి ఇది తెలంగాణ యువతకు ఏ మాత్రం ఉపయోగపడుతుంది అనేది.

Related posts