పుల్వామాలో భారత సైనికులపై జరిపిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిభిరాలపై భారత వాయుసేన మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతం అయ్యుంటారని భావిస్తున్నారు. ఈ సందర్భంగా మన వాయుసేనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ మీడియాలో సర్జికల్ స్ట్రైక్ 2 అనే హ్యాస్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సామాన్య పౌరులు మొదలు సెలబ్రిటీల దాకా సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.
ఉడీ ఘటన అనంతరం జరిగిన మెరుపు దాడుల ఆధారంగా తెరకెక్కిన ‘ఉడీ: ద సర్జికల్ స్ట్రైక్స్’ సినిమాలోని ‘హౌజ్ ద జోష్’ అనే డైలాగ్‌ను కోట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్‌లో ‘ఏయ్ పాకిస్తాన్, నువ్వు ఒకటి కొడితే మేం నాలుగు కొడతాం’ అంటూ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, రవీనా టండన్‌లు సోషల్ మీడియాలో భారతసైన‍్యంపై ప్రశంసల జల్లు కురిపించారు.
కాజల్, తమన్నాలాగా నేను మెథడ్ ఆర్టిస్ట్‌ను కాను… హీరో కామెంట్స్