telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈ ఏడాది చేప మందును పంపిణీ లేనట్టేనా

fish medicine

ప్రస్తుతం నెలకొన్న ఈ కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది చేప మందును పంపిణీ లేనట్టే అనిపిస్తుంది. అయితే బ‌త్తిని సోద‌రులు చేప మందును ప్రతి సంవత్సరం జూన్ నెల‌లో పంపిణీ చేస్తుంటారు. ఈ మందు కోసం తెలంగాణ‌లోనే కాకుండా ఇత రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హైద‌రాబాద్‌కు వ‌స్తుంటారు. అయితే, క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో తీవ్రంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా దేశంలో పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌వుతున్నాయి. రికార్ఢ్ స్థాయిలో మ‌రణాలు న‌మోద‌వుతున్నాయి. ఇటు తెలంగాణ‌లో కూడా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు. దీంతో జూన్ 8 వ తేదీన పింపిణీ చేయాల్సిన చేప ప్ర‌సాదంను నిలిపి వేస్తున్న‌ట్టు బ‌త్తిన హరినాథ్ గౌడ్ పేర్కోన్నారు. జూన్ 8 వ తేదీన చేప ప్ర‌సాదం ఇంట్లో వాళ్తు మాత్ర‌మే తీసుకుంటామని బ‌త్తిన సోద‌రులు పేర్కొన్నారు. చూడాలి మరి దీని పై మళ్ళీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనేది.

Related posts