telugu navyamedia
క్రీడలు వార్తలు

పుజారా, కోహ్లీ వికెట్ కోల్పోయిన భారత్…

భారత్-ఇంగ్లాండ్ మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. అయితే మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్లోనే వెనుదిరిగిన ఓపెనర్ గిల్ డక్ ఔట్ గా వెనుదిరిగాడు. దాంతో ఒక పరుగు చేయకుండానే వికెట్ కోల్పోయిన టీం ఇండియా. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పుజారా తో కలిసి రోహిత్ మంచి భాగసామ్యం నెలకొల్పే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలోనే 47 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత కాసేపటికే పుజారా(21) పరుగులకు వెనుదిరిగాడు. పుజారా ఔట్ కావడంతో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ 5 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే డక్ ఔట్ గా వెనుదిరిగాడు. దాంతో 86 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఇక కెప్టెన్ కోహ్లీ పెవిలియన్ చేరుకోవడంతో రోహిత్ తో కలిసి బ్యాటింగ్ చేసేందుకు వైస్ కెప్టెన్ రహానే వచ్చాడు. అయితే రహానే మొదటి టెస్టులో అంతగా రాణించని విషయం తెలిసిందే. చూడాలి మరి వీరు ఎలా ఆడుతారు అనేది.

Related posts