telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్ పై … ఐక్యరాజ్యసమితి సమావేశం … ట్రంప్ అధ్యక్షుడట..

UNO meet on J & K issue

జమ్మూకశ్మీర్ పై భారతప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పాక్ అంతర్జాతీయంగా కూడా ఏకాకి అయినప్పటికీ, నేడు జమ్మూకశ్మీర్ విషయమై ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షణ రహస్యంగా కొనసాగుతోంది. భద్రతా మండలిలో సభ్యత్వం ఉన్న దేశాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ వ్యవహారంపై పాక్ ఐక్యరాజ్య సమితికి పిర్యాధు చేయడంతో ఆ దేశానికి మద్దతు పలుకుతున్న చైనా ఒత్తిడితో ఈ సమావేశం కోనసాగుతోంది. ఐక్యరాజ్యసమితిలో అటు పాక్ గాని, భారత దేశం గాని లేకపోవడంతో ఎలంటీ పరిణామాలు జరగుతాయో అనే ఉత్కంఠ నెలకొంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కట్టబెట్టడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంపై మొదటి నుంచీ నిప్పులు చెరుగుతూ వస్తోన్న పొరుగు దేశం పాక్.. ఈ వ్యవహారాన్ని ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది.

పాక్ చేసిన ఫిర్యాదు మేరకు.. ఆర్టికల 370 రద్దు వ్యవహారంపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం అయింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా తీసుకొచ్చిన ఒత్తిడి మేరకే ఈ సమావేశం ఏర్పాటు కానుంది. పాక్ తో దోస్తీ చేస్తూ.. భారత్ పై కత్తి కట్టిన చైనా ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భద్రతా మండలిలో సభ్యత్వం ఉన్న దేశాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. కొన్ని అరుదైన సందర్భాల్లోనే భద్రతా మండలి క్లోజ్డ్ డోర్స్ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంపై పాక్ చేసిన విన్నపం మేరకు భద్రతా మండలి చాలాకాలం తరువాత క్లోజ్డ్ డోర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుండటం గమనార్హం. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కట్టబెట్టడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్ లో తీర్మానాన్ని ప్రవేశ పెట్టి, ఆమోదించిన విషయం తెలిసిందే.

Related posts