telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాహో’ సినిమా పేరుతో … గేమ్‌ .. ఆడి చూశారా..

game on sahoo movie in google play

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో గేమ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత ఐవోఎస్‌లో గేమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఆండ్రాయిడ్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ గేమ్‌ ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూశారు. అలాంటి వారికి శుభవార్త. ‘సాహో ది గేమ్‌’ను గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. గేమ్‌ ఆడాలనుకునే వారు గూగుల్‌ ప్లేలోకి వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ లింక్‌ను కూడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ గేమ్‌ యాప్‌ను పిక్సలాట్‌ ల్యాబ్స్‌ అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ‘సాహో’ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించింది.

Related posts