telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీకి కొత్త రాజధానిగా.. దొనకొండ.. భూముల ధరలకు రెక్కలు.. ప్రారంభమైన కొనుగోళ్లు..

donakonda as new capital to AP

ఇప్పటివరకు ఏపీ రాజధాని పై అనేక వార్తలు సామజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా, పేరు కూడా ప్రచారంలోకి వచ్చేసింది. కొత్త రాజధానిగా దొనకొండ అని వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం కోడుగుడ్డు ఆకారంలో ఉంటుంది. దీని చుట్టూ ఖాళీ భూములు.. దగ్గరలో సముంద్రం, పచ్చదనం.. ఇక చెప్పనవసరం లేదనుకుంట. దీంతో.. మన నేతల కళ్లు దానిపై పడ్డాయి. దొనకొండ ఏపీకి రాజధాని అవుతుందో.. లేదో పక్కన పెడితే.. వైసీపీ నేతల భూముల కొనుగోళ్లు మాత్రం ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ఖాళీగా ఉన్నాయని కొంటున్నారో.. లేక దీన్నే.. రాజధానిని చేద్దామని కొంటున్నారో.. తెలీదు కానీ.. మరికొన్ని రోజుల తర్వాత.. ఖాళీ భూమి మాత్రం కనబడదని మాత్రం చెప్పవచ్చు. ఇప్పుడు దొనకొండలోని ఎకరం భూమి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా పలుకుతోంది. మరికొన్ని రోజుల్లో.. ఇది నాలుగు రెట్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట.

కొత్త ప్రభుత్వం వచ్చాక.. చాలా మంది నేతలు.. ఏపీలో సుస్థిరంగా స్థిరపడాలని ప్లాన్లు వేస్తున్నారు. దీనిలో భాగమే.. దొనకొండలో భూములను కొంటున్నారనే పుకారు.. షికారు చేస్తోంది. అయితే.. కాదు.. సీఎం జగన్.. దీనిని త్వరలోనే రాజధానిగా ప్రకటిస్తారు.. అందుకే.. నేతలందరూ ఇక్కడ భూములు కొంటున్నారని మరో వార్త కూడా జోరుగా వినిపిస్తోంది. అందులోనూ.. ప్రకాశం జిల్లా.. రాయలసీమకు దగ్గరకూడా ఉంటుందనుకోండి. ఇంత జరుగుతున్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

Related posts