సినిమా ప్రపంచంలో హీరోయిన్ల నటన కంటే గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం గ్లామర్ షోను పక్కన పెట్టి కేవలం నటనకే ప్రాధాన్యతనిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంటారు. అలాంటి వారిలో మనం ఇంతవరకూ నిత్యామీనన్ ను చూశాం. ఇప్పుడు సాయి పల్లవి కూడా అదే జాబితాలో చేరిపోయింది. ప్రేమమ్, ఫిదా చిత్రాలతో ప్రేక్షకులను ఫిదా చేసి యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది సాయి పల్లవి. గ్లామరస్ పాత్రలకు, కమర్షియల్ సినిమాలకు దూరంగా మంచి నటన, అద్భుతమైన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో దక్షిణాదిన ఎంతోమంది అభిమానులను సంపాదించకుంది. తమిళ, మలయాళ, తెలుగు సినీ పరిశ్రమల్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. “ఫిదా” చిత్రంలోని “వచ్చిండె…” సాంగ్‌లో సాయి పల్లవి స్టెప్స్ ఆడియన్స్‌కి కేక పుట్టించాయి. ఈ సాంగ్ కొన్నాళ్లపాటు వైబ్రేషన్స్ క్రియేట్ చేయగా, ఇటీవల మారి 2 చిత్రంలో “రౌడీ బేబి” అనే సాంగ్‌తో మరోసారి ప్రేక్షకులకి మాంచి కిక్ ఇచ్చింది ఈ మలయాళీ భామ. ధనుష్‌తో కలిసి సాయి పల్లవి వేసిన స్టెప్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు మరో అరుదైన రికార్డ్ ఆమె ఖాతాలో చేరింది. ఎంసీఏ చిత్రంలోని “ఏవండోయ్ నాని గారు” అనే సాంగ్‌కి సాయి పల్లవి, నాని కలిసి డ్యాన్స్ చేయగా… ఇందులోని స్టెప్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సాంగ్ వంద మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుంది. దీంతో సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డ్ చేరింది. ఆమె నటించిన మూడు వీడియో సాంగ్స్‌కి పది కోట్లకి పైగా వ్యూస్ రావడం విశేషం.