పాకిస్థాన్ లో భూ కంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. ఇస్లామాబాద్, రావల్పిండిలో భూ ప్రకంపనలు రావడంతో భయాందోళనలకు గురైన ప్రజలు తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. లాహోర్ కు 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు సమాచారం.
పాక్ లో భూకంప ప్రభావం ఉత్తర భారతదేశంపై పడింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు కశ్మీర్, పంజాబ్,హర్యానా, గురుగ్రామ్‌లో భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్ర 4:30 నిమిషాల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది: యనమల