telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వెంకన్న భక్తులకి టీటీడీ షాక్.. ఆ కోటా భారీగా తగ్గింపు !

ttd plans to venkanna temples in mumbai and j & K

కల్యాణోత్సవ ఆన్ లైన్ టిక్కెట్ల కోటా పై సీలింగ్ విధించింది టీటీడీ. గత కొద్ది రోజులుగా నిత్యం వేల సంఖ్యలో టిక్కెట్లను భక్తులు కొనుగోలు చేసారు. ఏకంగా అక్టోబర్ 3వ తేదీన అయితే రికార్డు స్థాయిలో 4300 టిక్కెట్లను కొనుగోలు చేసారు భక్తులు. అలానే గత శని, ఆదివారాలలో కల్యాణోత్సవ సేవా టిక్కెట్ల పై శ్రీవారిని దర్శించుకున్నారు 16 వేల మంది భక్తులు. దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం రోజుకు 1000 కల్యాణోత్సవ టిక్కెట్లను మాత్రమే జారీ చేస్తుంది టీటీడీ. అలానే సీలింగ్ విధించడంతో ఈ నెల 15 వ తేదీ వరకు టిక్కెట్లు విక్రయాలు పూర్తి అయ్యాయి.

 

ఈ నెల 16వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు నేపథ్యంలో కల్యాణోత్సవ సేవ 10 రోజుల పాటు రద్దు చేసారు. అంటే 26వ తేదీ నుంచి కల్యాణోత్సవ సేవా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. కల్యాణోత్సవ సేవ టిక్కెట్టు పొందిన భక్తులకు పోస్టల్ ద్వారా టీటీడీ ప్రసాదాన్ని భక్తులకు అందజేయనుంది. లాక్ డౌన్ వలన భారీగా ఆదాయం తగ్గడమే కాక జనాలు కూడా తిరుమలకు రావడానికి భయపడుతున్న నేపధ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ టికెట్ ఉన్న వారు ఏడాదిలోపు ఎప్పుడైనా ఒక సారి స్వామి వారి దర్శనం చేసుకోవచ్చని నిభందన ఉండడంతో ఇక ఇది సరికాదని భావించి టీటీడీ ఈ సీలింగ్ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

Related posts