గండికోట ముంపు బాధితులకు పరిహారం ఇ్వవకుండా వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్ లో పేర్కొన్నారు. కేవలం 500 మందికే చెక్కులిచ్చి.. మిగిలిన 2,369 మందికి ఇవ్వకుండా వేధించడం ఏంటని నిలదీశారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఓటీఎస్ ప్యాకేజీ ఇవ్వకుండానే తాళ్లపొద్దుటూరు గ్రామస్తులను ఖాళీ చేయమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్కడ నివసించే 1500 కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు.
భారీ వరదలకు వచ్చిన 26 టీఎంసీల నీళ్లు గండికోట రిజర్వాయర్లో పెట్టుకునే అవకాశం లేకుండా చేశారని తెలిపారు. ఇటు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్, ఓటీఎస్ ప్యాకేజీలు ఇ్వవకుండా వేధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించాల్సి రావడం బాధాకరమని అన్నారు.
పారదర్శక పాలన అందించేందుకు జగన్ కృషి