telugu navyamedia
రాజకీయ వార్తలు

మాతృభాష అవసరాన్ని నొక్కిచెప్పిన మోదీ

modi on jammu and kashmir rule

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ-2020 ప్రకటించారు. దీనిపై దేశవ్యాప్తంగా సానుకూల స్పందనలు వస్తున్నాయి. దీనిపై మోదీ ఓ సదస్సులో మాట్లాడుతూ పిల్లలకు మాతృభాషలో బోధించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

సరికొత్త విద్యావిధానం ద్వారా విద్యార్థులు ప్రపంచ పౌరులుగా రూపుదిద్దుకుంటారని తెలిపారు. పిల్లలు ఏ భాషలో మాట్లాడతారో, ఆ భాషలోనే త్వరగా నేర్చుకుంటారని ఆయన స్పష్టం చేశారు.

నాలుగేళ్ల పాటు సాగించిన మేధోమథనం తర్వాత ఎన్ఈపీ-2020కి తుదిరూపకల్పన చేశామని వెల్లడించారు. కనీసం 5వ తరగతి వరకైనా మాతృభాషలో బోధన అవసరమని గుర్తించామని తెలిపారు. అందుకే ఈ అంశానికి ఎన్ఈపీ-2020లో ప్రముఖ స్థానం కల్పించామని మోదీ చెప్పారు.

వినూత్న జాతీయ విద్యావిధానం నూతన ప్రపంచంలోకి విద్యార్థులను నడిపిస్తుందని అన్నారు. తాము తీసుకువచ్చిన ఈ భావి విద్యావిధానానికి ఎక్కడా నిరసనలు వ్యక్తం కాలేదని చెప్పారు.

Related posts