telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నాని కొత్త సినిమా టీజర్ వచ్చేది..?

Nani

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. టక్ జగదీష్, అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో పాటు ఈ ఏడాది చివరికి ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం నాచురల్ స్టార్ తన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ ‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇతర సినిమాల నుండి వరుసగా టీజర్లు, ట్రైలర్లు విడుదల అవుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా నాని కూడా చేరనున్నారు. నాని శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి టీజర్ పై కొన్ని వార్తలు హల చల్ చేస్తున్నాయి. ఈ సినిమా టీజర్ ఉగాది పండగ సందర్భంగా విడుదల అవుతుందంటూ వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా టీజర్‌పై ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. నాని కెరీర్‌లో ఎన్నడూ లేనివిధంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అంతేకాకుండా శ్యామ్ సింగరాయ్ పాన్ ఇండియా రేంజ్ సినిమా అని కూడా టాక్ నడుస్తోంది.

Related posts